అమరావతిముచ్చట్లు:
ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్మి కి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.. ఆమెను GAD, GPM&AR శాఖాధిపతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. ఖాళీగా గా వున్న అదే పోస్టులో ఎప్పుడో, శ్రీలక్మి ని నియమిస్తే బాగుండేది కధా.. ఆమె చేసిన నేరం ఏమిటి!? తప్పు ఏమిటో!? సీఎం చంద్రబాబు చెప్పాల్సివుంటుంది.. అవినీతి ఆరోపణలు వున్నవారిని, ప్రాధాన్యత పోస్టులలో నియమించిన సీఎం చంద్రబాబు , శ్రీలక్మి విషయంలో, కావాలని ఆమె కు రెండేళ్ళ నుండి పోస్టింగ్ ఇవ్వకుండా తప్పు చేసారు.. జూన్ 30 తేదీన ఆమె రిటైర్ అవ్వబోతున్నారు.. గురువారం శ్రీలక్మి కి, పధకం ప్రకారమే పోస్టింగ్ ఇచ్చినట్లు స్పష్టమవ్వుతోంది.. రేపు అనగా శుక్రవారం సెలవు ( ముస్లిం పండుగ మొహరం సందర్భంగా ) , శని వారం ఆదివారం లు మాములుగా సెలవలే.. సోమవారం ఉదయం న శ్రీలక్మి డ్యూటీలో జాయిన్ అయ్యి, సాయింత్రం రిటైర్డు అవుతారు.. ఇప్పుడు ఏ తప్పూ చేయని, ఒక మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారిణికి రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా, ఇంటికే పరిమితం చేసిన ఘనత, సీఎం చంద్రబాబు కే దక్కింది.
.కాపు కులం కు చెందిన ఆమె కు రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా, రిటైర్డు కు, ఒక రోజు ముందే పోస్టింగ్ ఇవ్వటం బాధాకరం అని, టీడీపీ కాపు ఎమ్మెల్యే లే ఆఫ్ ధి రికార్డు గా ఆవేదన వ్యక్తం చేసారు..కన్పించని రౌడీ షీటర్ ను, మర్డర్లు చేసిన వ్యక్తి కోసం, వైసీపీ కాపు మాజీ మంత్రులు చేసిన హడావుడి ఇంతా, అంతా కాదు.. కొన్ని రోజులు వరసగా నిరసనలు, మీడియా సమావేశాలు నిర్వహించి, రెచ్చిపోయి, కాపు కులస్థులును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన, వైసీపీ కాపు కులం మాజీ మంత్రులు, రెండేళ్లనుండి ఒక సీనియర్ కాపు కులం కు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్మి కి పోస్టింగ్ ఇవ్వకపోయినా, నోరు తెరవని, వైసీపీ కాపు కులం కు చెందిన మాజీ మంత్రులు, కన్పించటం లేదనీ ఒక రౌడీ షీటర్ విషయంలో అంత అల్లరి చేసారు.. ఎవ్వరి వల్ల శ్రీలక్మి , అన్ని విధాలుగా దెబ్బతిన్నారో, వారే ఆమెకు అండగా నిలవలేదు.. కేవలం 21 ఏళ్ళకే ఐఏఎస్ అధికారిణి అయిన శ్రీలక్మి , కేంద్ర క్యాభినెట్ సెక్రటరీ అవ్వాల్సిన అర్హతలున్నప్పటికి, ఆమె ని అవస్థలు పాలు చేసిందేవ్వరో, రాజకీయ, అధికార వర్గాలకు తెలుసు.. రెండేళ్ళ నుండి పోస్టింగ్ ఇవ్వకుండా, శ్రీలక్మి ని అవమానించి,ఏ తప్పు చేయని( గతంలో తప్పులు చేశారన్న విమర్శలు వచ్చాయి.. అందుకు ఆమె భారీ ఎత్తున మూల్యం చెల్లించుకొని అనారోగ్యం పాలు కూడా అయ్యి, పరువు, ప్రతిష్టలను కూడా పొగట్టు కున్నారు ) ఆమె కు రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా, రిటైర్ మెంట్ ఒక రోజు ముందే,సీఎం చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారంటే, అధి ఆమె కన్నా, కూటమి ప్రభుత్వానికే అవమానం..
Tags:Government issues posting to IAS officer Sri Lakshmi.