March 22, 2026
Explore
మానవత స్వచ్చంద సేవా సంస్థ నెలవారీ సమావేశం

మానవత స్వచ్చంద సేవా సంస్థ నెలవారీ సమావేశం

March 22, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో మానవత స్వచ్చంద సేవా సంస్థ నెలవారీ సమావేశం ప్రతిభ జూనియర్ కాలేజీలో చైర్మన్ శివగంగిరెడ్డి, అధ్యక్షుడు అంకం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఎన్జీవో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మడితాటి వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ నాగిరెడ్డి, రిటైర్డ్ హెడ్మాస్టర్ ముత్తుకూరు ఖాదర్ బాషా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వేణుగోపాల్ రెడ్డి సంస్థకు రూ.10,116 విరాళం అందజేశారు. డాక్టర్ నాగిరెడ్డి, ఖాదర్ బాషా కూడా భవిష్యత్తులో సేవలకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.

చైర్మన్ శివగంగిరెడ్డి, అధ్యక్షుడు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ వ్యవస్థాపకుడు నిమ్మనపల్లి రామచంద్రారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Tags: Manavatha Voluntary Service Organization: Monthly Meeting