పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీగురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం అర్చకులు స్వామివారికి ప్రీతికరమైన ఆరుద్ర చూర్ణంతో అభిషేకం చేశారు. అలాగే బైపాస్ రోడ్డులోని భీమగానిపల్లె సర్కిల్‌లో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని , పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి అన్నదానము, హరికథ కాలక్షేపం నిర్వహించారు.

Tags: Worship of Sri Dakshinamurthy and Hanuman