June 25, 2026
Explore
రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ ప్రమాణ స్వీకారం

June 25, 2026 | Andhra Pradesh

​న్యూఢిల్లీ ముచ్చట్లు:

పార్లమెంట్ భవనంలో గురువారం రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సమక్షంలో ఆయన ప్రమాణం చేసి, అధికారికంగా తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు ప్రతిష్టాత్మక పెద్దల సభలో అడుగుపెట్టడం పట్ల పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, ప్రజా సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడంలో పార్లమెంట్ వేదికగా ఆయన తన గళాన్ని బలంగా వినిపిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags: Chintakayala Vijay takes oath as Rajya Sabha member.