మదనపల్లి ముచ్చట్లు:
– జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
అన్నమయ్య జిల్లా నూతన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బి) సీఐగా సదాశివయ్య నేడు బాధ్యతలు స్వీకరించి, జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌బీ పాత్ర చాలా కీలకమన్నారు.అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, పక్కా ముందస్తు సమాచారంతో నేరాలను అరికట్టాలని నూతన సీఐని ఆదేశించారు.అంకితభావంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:The Special Branch serves as the eyes and ears of the Police Department: