June 23, 2026
Explore
మహిళా భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన

మహిళా భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన

June 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం.
  • ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మహిళలపై నేరాలు, మహిళల అక్రమ రవాణాపై చట్టపరమైన అవగాహన కల్పింపు.
  • శక్తి యాప్, మహిళల రక్షణ చర్యలు, అత్యవసర హెల్ప్‌లైన్ సేవల వినియోగంపై వివరాలు.
  • లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఉద్యోగ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన.
  • సోషల్ మీడియా దుర్వినియోగం, గుర్తు తెలియని లింకులు, వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాలపై హెచ్చరిక.
  • మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై చైతన్యం.
  • మహిళలు, యువత సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని పిలుపు.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, కారకంబాడిలో షక్తి టీమ్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీలత పాల్గొని మహిళల భద్రత, సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి సామాజిక సమస్యల వల్ల కలిగే పరిణామాలను వివరించి, ఇటువంటి ఘటనలను సహించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మహిళల భద్రత కోసం రూపొందించిన షక్తి యాప్ వినియోగంపై వివరించారు.

సైబర్ నేరాల నేపథ్యంలో లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్, గుర్తు తెలియని లింకులు మరియు వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యక్తిగత సమాచారం నిర్లక్ష్యంగా పంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించి, సురక్షితమైన డిజిటల్ వినియోగంపై సూచనలు అందించారు.

యువత వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన, మంచి అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించి, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

అలాగే మహిళల అక్రమ రవాణా, మహిళలపై జరిగే నేరాలు, సమాజంలో ఇటీవల చోటుచేసు కుంటున్న వివిధ సంఘటనలు, వాటి నుంచి రక్షణ చర్యలు, చట్టపరమైన అంశాలపై ఉదాహరణలతో అవగాహన కల్పించారు. మహిళలు మరియు యువత ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు. పోలీస్ ఎమర్జెన్సీ సహాయం – 112.
మహిళల హెల్ప్‌లైన్ – 181.
షక్తి / మహిళా భద్రత సహాయం – 112.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ – 1930.
సైబర్ ఫిర్యాదుల వెబ్‌సైట్ – www.cybercrime.gov.in
చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098.
అంబులెన్స్ సేవలు – 108. ఆరోగ్య సలహా సేవలు – 104

ఈ కార్యక్రమంలో షక్తి టీమ్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు యువత పాల్గొన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ శ్రీలత పిలుపునిచ్చారు.

Tags; Special awareness on women’s safety and the prevention of cybercrimes.