June 21, 2026
Explore
25న ఉచిత కంటి వైద్యశిబిరం

25న ఉచిత కంటి వైద్యశిబిరం

June 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని బట్టందొడ్డి సమీపంలో గల ఆర్‌కె జూనియర్‌ కళాశాల ఈనెల 25న ఉదయం 9 గంటల నుంచి ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అయూబ్‌ఖాన్‌ తెలిపారు. అబ్దుల్‌కలామ్‌ చారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం పీఈఎస్‌ కు చెందిన వైద్యబృందంచే వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు చికిత్సలు, ఆపరేషన్లు చేసుకోవాలని కోరారు.

Tags; Free Eye Camp on the 25th