June 19, 2026
Explore
జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఆర్ల శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ.

జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఆర్ల శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ.

June 19, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10.00 గంటలకు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (పరిపాలన)గా ఆర్ల శ్రీనివాసులు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఆర్ల శ్రీనివాసులు గతంలో తిరుపతి జిల్లాలో అదనపు ఎస్పీ (క్రైమ్స్)గా సమర్థవంతంగా సేవలందించారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమితులయ్యారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.

తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా బాధ్యతలు స్వీకరించిన ఆర్ల శ్రీనివాసులు తమ అనుభవం, నిబద్ధతతో జిల్లా పోలీసు పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని జిల్లా పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:Arla Srinivasulu assumes charge as District Additional SP (Administration).