సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలంలోని మోటకట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాయచోటి నుంచి పాఠశాలకు విద్యార్థులు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు రాయచోటి బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సు పాఠశాలకు చేరుకోగా, సాయంత్రం 4 గంటలకు తిరిగి రాయచోటికి వస్తుంది. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
గౌరవ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. ఉత్తమ విద్యా ఫలితాలతో పాటు NMMS వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. 📞 9440246825.
Tags: Bus facility for Motakatla High School… Admissions begin.