నల్గొండముచ్చట్లు:
మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేసిన భార్యాభర్తలు రాజీవ్, పావని పోలీసులకు చిక్కారు.
ఆదాయం కోసం ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు.
ప్రింటర్, ప్రత్యేక పేపర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, ఇంట్లోనే రూ.500 నకిలీ నోట్లను ముద్రించి, సంతలు, షాపుల్లో చెలామణి చేసేవారు.
చండూరులో ఒక మిల్క్ సెంటర్‌లో నకిలీ నోటు ఇవ్వడంతో యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు విచారణ జరిపి, వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు.
Tags; Couple arrested for making counterfeit notes after watching YouTube