June 17, 2026
Explore
ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరం..!

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరం..!

June 17, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ.

ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు ఈడీ గుర్తింపు.. ఏపీ సిఐడి FIR ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు.

మద్యం రవాణా టెండర్లను ఎంపిక చేసిన సంస్థలకు అనుకూలంగా మార్చినట్లు ఆరోపణలు.. ‘సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్’ బినామీ సంస్థగా పనిచేసినట్లు ఈడీ గుర్తింపు.

రాజ్ కెసిరెడ్డి ప్రధాన కుట్రదారుడిగా ఉన్నట్లు.. అప్పటి APSBCL MD వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తింపు.

జిల్లాస్థాయి రవాణా విధానం రద్దుచేసి, కేంద్రీకృత విధానం అమలు చేసినట్లు తేల్చిన ఈడీ.. రవాణా ఛార్జీలను కృత్రిమంగా పెంచి అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ గుర్తింపు.

ప్రభుత్వ అనుమతి లేకుండానే టెండర్ల గడువును పొడిగించినట్లు గుర్తింపు.. మరిన్ని కీలక విషయాలపై ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం.

Tags: Investigation into the AP liquor transport scam intensifies!