June 16, 2026
Explore
ఆర్టీసి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

ఆర్టీసి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

June 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలో బండ్లపల్లెకి చెందిన ఆర్టీసి కాంట్రాక్ట్ ఉద్యోగి నాగరాజ(31) తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపంకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు బండ్లపల్లెకి చెందిన నాగరాజు స్థానిక డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు.

Tags: RTC contract worker dies