అసమ్మతినేతలతో బేటి
-చర్యలు తీసుకుంటామని హామి
పుంగనూరుముచ్చట్లు:
స్థానిక తెలుగుదేశం నాయకుడు అవినీతి అక్రమాలతో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుగుదేశం అసమ్మతివర్గం నాయకుడు మంగళవారం లోకేష్‌ను పార్టీ కార్యాలయంలో కలిశారు. మండల నాయకుడు సుబ్రమణ్యంరాజు, పట్టణ నాయకుడు మధుసూదన్‌రాయల్ , జనార్ధన్, పెద్దమోహన్‌నాయుడు, గంగులప్ప, నాగరాజాచారి, శివ, రాఘవరాయల్, సదుం వెంకట్రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వినోద్, దేవేంద్ర, అమర ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా బోయకొండలో భక్తులపై జరుగుతున్న దాడులు, అక్రమ వసూళ్ళపైన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే ట్రాన్స్కోలో ఆపరేటర్ పోస్టుల నియామకానికి ఒకొక్కరి దగ్గర రూ.5 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. అలాగే మండల పార్టీ కన్వీనర్ల నియామకాలు చేపట్టాలని, బోయకొండకు పాలక మండలిని నియమించాలని లోకేష్‌ను కోరారు. కాగా అసమ్మతివర్గం నాయకుల ఫిర్యాదులను లోకేష్ సావదానంగా విని ఇన్‌చార్జ్ మార్పుపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తె లిసింది.

Tags: Complaint lodged with Lokesh against Telugu Desam leader.