పుంగనూరు ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదంలో ఓఆటోడ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని సుగాలిమిట్ట వద్ద జరిగింది. మంగళవారం మదనపల్లె నుంచి పుంగనూరుకు ఆటో వస్తుండగా వెనుకవైపు నుంచి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎన్‌ఎస్.పేట రామ్‌నగర్‌కు చెందిన తయూబ్(40) కు తీవ్ర గాయాలైయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Auto-rickshaw driver injured in road accident