June 16, 2026
Explore
ముస్లింలచే ఎస్‌ఐఆర్‌పై ఇంటింటా అవగాహన

ముస్లింలచే ఎస్‌ఐఆర్‌పై ఇంటింటా అవగాహన

June 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి ముస్లిం నాయకులు, పార్టీ బిఎల్‌వోలు కలసి ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సువ్‌ రివిజన్‌ ) కార్యక్రమాన్ని ఇంటింటా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో రెండవ రోజు అధికారులతో కలసి ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు పై పకడ్భంధిగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని యూబికాంపౌండు, ఎన్‌ఎస్‌.పేట, రహమత్‌నగర్‌, తూర్పువెహోగసాల ప్రాంతాలలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పట్టణ కన్వీనర్‌ ఇర్ఫాన్‌, మైనార్టీల కార్యదర్శి అస్లాంమురాధి లు విడివిడిగా ఎస్‌ఐఆర్‌లో పాల్గొంటున్నారు. అలీమ్‌బాషా మాట్లాడుతూ 2002 ఓటర్ల జాబితా ప్రకారం పేర్లు ఉండాలని సూచిండం కష్టమన్నారు. ప్రతి ఒక్కరికి పుట్టినతేదీ ధృవపత్రాలు ఇవ్వలేని పరిస్థితి అని తెలిపారు. ప్రభుత్వం ముస్లిం ఓట్ల తొలగింపులో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పార్టీ శ్రేణులు ఈ విషయంలో జాగ్రత్తలు వహించి, ఒక ఓటు కూడ తొలగిపోకుండ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు అజీజ్‌, బావాజాన్‌, ఖాన్‌, సలామత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; Door-to-door awareness campaign on SIR by Muslims