June 16, 2026
Explore
జూన్ నెలాఖరులో విద్యార్థులకు జాక్‌పాట్.

జూన్ నెలాఖరులో విద్యార్థులకు జాక్‌పాట్.

June 16, 2026 | Andhra Pradesh

. ప్రభుత్వం ప్రకటించిన కొత్త హాలిడేస్ ఇవే!

అమరావతిముచ్చట్లు:

AP Holidays 2026: వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన వేళ విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్ అందింది. మొహర్రం సందర్భంగా ప్రకటించిన సెలవుల తేదీల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 25న ఐచ్ఛిక సెలవు, జూన్ 26న సాధారణ సెలవు ఉండనుండటంతో నెలాఖరులో విద్యార్థులు, ఉద్యోగులకు అదనపు విశ్రాంతి దక్కనుంది

అమరావతి, జూన్‌ 16: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇప్పుడిప్పుడే బడులు, కాలేజీలు తెరచుకుంటున్నాయి. కొత్త విద్యాసంవత్సరం మొదలవడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు కొత్త పుస్తకాలు, బ్యాగులు , యూనీఫాం వంటి వాటి కొనుగోళ్లతో బిజీగా ఉన్నారు. సాధారణంగా స్కూళ్లు మొదలైన జూన్‌ నెలలో ప్రభుత్వ సెలవులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి జూన్‌ నెలలో విద్యార్ధులు మరికొన్ని సెలవులు కలిసిరానున్నాయి. ఏపీ ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రకటించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల తేదీల్లో మార్పులు చేసింది. మొహర్రం సందర్భంగా జూన్‌ 16న (మంగళవారం) ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే దానిని జూన్‌ 25కి మార్పుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మొహర్రం సాధారణ సెలవుని జూన్‌ 25వ తేదీగా గతంలో ప్రకటించగా, దానిని 26వ తేదీకి మార్చింది.

9వ మొహర్రం (Optional Holiday) జూన్‌ 25న, 10వ మొహర్రం జూన్‌ 26న (General Holiday) వచ్చే అవకాశం ఉందని తన ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది. చంద్ర క్యాలెండర్ (Lunar Calendar) ప్రకారం 9వ మొహర్రం 25 జూన్ 2026న, 10వ మొహర్రం 26 జూన్ 2026న వచ్చే అవకాశం ఉన్నందున ఈ మేరకు ఐచ్ఛిక, సాధారణ సెలవు తేదీలను మార్పు చేయాలంటూ ఏపీ వక్ఫ్‌బోర్డు సీఈవో చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. దీంతో నెలాఖరుకు సెలవులు కలిసిరానున్నాయి.

👉మొహర్రం కొత్త తేదీలివే..

9వ మొహర్రం 16 జూన్ 2026 (మంగళవారం) స్థానంలో 25 జూన్ 2026 (గురువారం) ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. 10వ మొహర్రం / షహాదత్ ఇమామ్ హుస్సేన్ (General Holiday) 25 జూన్ 2026 (గురువారం) స్థానంలో 26 జూన్ 2026 (శుక్రవారం) సాధారణ సెలవుగా ప్రకటించింది. ఆ తర్వాత శనివారం ఒక్క రోజు మినహాయిస్తే జూన్ 28న ఆదివారం సెలవు రానుంది. వరుసగా వీకెండ్ కు మూడు రోజులు సెలువులు రానున్నాయి.

Tags: A jackpot for students at the end of June.