తిరుపతి ముచ్చట్లు:
- తోటంబేడు మండలంలో గ్రామ సచివాలయంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం.
- సంగమిత్రలు, ద్వాక్రా కమిటీ సభ్యులు, స్థానిక మహిళలతో పోలీసుల సమావేశం.
- మహిళలపై నేరాల నివారణ, చట్టపరమైన రక్షణ చర్యలపై అవగాహన.
- మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవల వివరాలపై సూచనలు.
- తోటంబేడు మండలంలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మహిళల భద్రతపై తోటంబేడు మండలంలోని గ్రామ సచివాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మరియు తోటంబేడు ఎస్‌ఐ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్‌ఐ, తోటంబేడు మండల గ్రామీణ మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సంగమిత్రలు, ద్వాక్రా కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, గృహహింస, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.
బి.ఎన్. కండ్రిగ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ “మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీస్ శాఖను సంప్రదించాలి. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మహిళలపై నేరాలను అరికట్టడంలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం కావాలి” అని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 112 నంబర్‌కు, మహిళా హెల్ప్‌లైన్ 181కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Tags:Awareness program on women’s safety.