అంధులైన కుమారులకు అన్నితానై సేవలు
-అంధత్వంతో చీకటిమయమైన మోహన్, గోపినాథ్ జీవితాలు
- ఏడు పదుల్లో నాన్నకు తప్పని కష్టాలు
పుంగనూరుముచ్చట్లు:
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవలు చేయడం బిడ్డల బాధ్యత. అందుకు భిన్నంగా ఎదిగిన పిల్లలకు సేవలు చేస్తూ ఆదంపతులు తరించిపోతున్నారు. పుట్టినప్పుడు బాగున్న , పెరిగేకొద్ది ఇద్దరు కుమారులు అంధులుగా మారిపోవడం ,ప్రపంచాన్ని చూడలేకపోయారు. మూడు పదుల వయసులో ఉన్న బిడ్డలను చంటిపిల్లలా కాపాడుకుంటు , అన్ని తామై మాసిపోని మానత్వానికి , కన్నప్రేమకు ఆదంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇద్దరు కుమారులు పుట్టారని ఆదంపతులు ఆనందంలో మునిగిపోయారు. అయితే దురదృష్టం వెంటాడింది. వారి ఆశలు అడియాశలైంది. వయసు పెరిగేకొద్ది ఇద్దరు పిల్లలకు కనుచూపు మందగించడంతో వారి జీవితాల్లో చీకటి అలుముకుంది.
వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని బత్తలాపురం గ్రామానికి చెందిన ఈటి.అగిస్తి , జయమ్మ దంపతులు కూలీపని చేసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మోహన్(36), గోపినాథ్(34)లు ఉన్నారు. ఇలా ఉండగా మోహన్ ఎలిమెంటరీ స్కూల్‌లో చేరే సమయంలో హఠాత్తుగా చూపుమందగించింది. అదే సమయంలో రెండవ కుమారుడు కూడ చూపుకనపడకుండ పడిపోవడం చేశాడు. ఈ సమయంలో పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్సలు చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆతేదీ నుంచి కుమారుల ఆలన, పాలన తల్లిదండ్రులపైనే పడింది.
70 ఏళ్ల వయసులో…
డెబైఏళ్ల వయసు ఉన్న అగిస్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. కానీ అవిశ్రాంతంగా ఉదయం లేవగానే ఎలాంటి విసుగు చెందకుండ కుమారులైన మోహన్, గోపినాథ్‌లను తీసుకెళ్లి కాలకృత్యాలు తీరుస్తారు. ఉదయం 9 గంటలకు స్నానం చేయించి అల్ఫాహారం తినిపించడం , బట్టలు వేయడం వారికి తలకు నూనేపెట్టి దువ్వడం లాంటి కార్యక్రమాలు అన్ని తానై చేయాల్సి వస్తోంది. తల్లి జయమ్మ వంటచేసి పిల్లలకు పెట్టడం, తరువాత ఇద్దరు కలసి కూలీ పనులకు వెళ్లడం వీరి దినచర్యగా మారింది.

Tags: Father is the light…