పెద్దమండెం ముచ్చట్లు:
పెద్దమండెం మండలం దిగుపల్లి గ్రామంలో జరిగిన దాడి ఘటనపై బాధితులు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన పాల ఏకరి కులస్తులపై అదే గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
బాధితుల కథనం ప్రకారం, యుగంధర్ రెడ్డి కుటుంబ సభ్యులు దారికాచి అడ్డగించి, యుగంధర్ రెడ్డి తల్లితో పాటు మరికొందరు కలిసి బాధితుల కళ్లలో కారంపొడి చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసు అధికారులను కోరారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Tags: Attack incident in Digupalli: Victims appeal for action.