కడప ముచ్చట్లు:
కడప నగరంలోని రిమ్స్ సమీప శిల్పారామం రోడ్డుపై ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఏడుగురు యువకులు, మైనర్లపై రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. వీరి చర్యలతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై స్పందించిన రిమ్స్ సీఐ రాజగోపాల్, మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ రాజగోపాల్ హెచ్చరించారు.
Tags:Stunts on bikes… cases registered against youths…