అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఎన్సీసీ (NCC)డైరెక్టరేట్ ను మంజూరు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీతో పాటు ఝార్ఖండ్ రాష్ట్రానికి కూడా కేటాయించడంతో దేశంలో వీటి సంఖ్య 19కి చేరింది. ఈ నూతన వ్యవస్థ వల్ల ఏపీలోని విద్యాసంస్థల్లో ఎన్సీసీ కార్యకలాపాలు విస్తరించి, మునుపటి కంటే ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ, మెరుగైన మౌలిక వసతులు అందుతాయని రక్షణశాఖ తెలిపింది.
Tags: NCC Directorate sanctioned for AP