అమరావతిముచ్చట్లు:
సాఫ్ట్వేర్ యువతి మొదటి విడాకులకు భరణం కింద 20 లక్షలు తీసుకుంది, రెండో పెళ్లి విడాకులకు 12 కోట్లు, ఒక బీఎండబ్ల్యూ కారు డిమాండ్ చేసింది.. అబ్బాయిలూ షాక్ తిన్నారా..? పెళ్లి చేసుకోవడం, విడాకులుఇవ్వడం, భరణం కింద లక్షలు, కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం.. చెప్పేందుకు విడ్డూరంగానే ఉన్నా ఇది నిజం . కొంతమంది మహిళలకు ఇదో వ్యాపారం అయిపోయింది. హై క్లాస్ మహిళలని చెప్పుకుంటూ సమాజంలో విలాసవంతమైన జీవితం గడిపే వారి విషయంలో ఇది అక్షర సత్యం గా మారుతుంది . ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. తాజా సంఘటన కూడా అలాంటిదే. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి మొదటి పెళ్లి నుంచి విడాకులు కోరుకుంది. భరణం కింద 20 లక్షల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద తీసేసుకుంది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా కొంతకాలానికి పెటాకులైంది. దీనికి సంబంధించి కూడా రెండో పెళ్లి నుంచి 12 కోట్ల రూపాయల భరణం, ఒక బీఎండబ్ల్యూ కారు కావాలని కేసు వేసింది .కింద కోర్టు తెచ్చిన తీర్పు మీద కోర్టుకెళ్ళింది . ఈ పిటిషన్ చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి , ముంబైలో ఉన్న నాలుగు కోట్ల రూపాయలు ప్లాట్ ను ఆమెకు బదిలీ చేసి పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది . పెళ్లి విడాకులు రెండిటిని వ్యాపారంగా పెట్టుకొని కొంతమంది మహిళలు కోట్లు సంపాదిస్తున్నారని పలువురు ఆరోపణ చేశారు. ఇలాంటి వాటి పట్ల చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు .
Tags: Software professional receives ₹20 lakh as alimony in first divorce.