June 13, 2026
Explore
బస్సు అగ్నికి అహుతి.. తప్పిన ప్రాణాపాయం

బస్సు అగ్నికి అహుతి.. తప్పిన ప్రాణాపాయం

June 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

సూళ్లూరుపేట వద్ద పెను ప్రమాదం తప్పింది.

శ్రీ సిటీకి చెందిన ఎస్‌బీఎల్‌టీ బస్సు జాతీయ రహదారిపై జీరో పాయింట్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది.

గ్రామాల నుంచి కార్మికులను శ్రీ సిటీలో దించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

Tags; Bus gutted by fire; lives spared.