పీలేరు ముచ్చట్లు:
పీలేరులోని కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ వివాదం చర్చనీయాంశమైంది. రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ తాకట్టు పెట్టిన బంగారు నగలను తిరిగి ఇవ్వడం లేదంటూ శివమ్మ అనే ఖాతాదారురాలు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుడి చికిత్స కోసం నగలు అవసరమని ఆమె వాపోయారు. అయితే గతంలో ఆమె మరో రుణగ్రహీతకు జామీను ఇచ్చిన నేపథ్యంలో ఆ రుణ వ్యవహారం ఇంకా పెండింగ్‌లో ఉందని, బ్యాంకు నిబంధనల ప్రకారం నగలు విడుదల చేయలేమని మేనేజర్ రిహానా వివరణ ఇచ్చారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని విచారణ చేపట్టారు.
Tags: Won’t the jewelry be handed over despite payment? Woman protests in front of the bank.