ములకలచెరువు ముచ్చట్లు:
ములకలచెరువు మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు పాత ములకలచెరువుకు చెందిన రాజప్ప (36) తన భార్య గాయత్రితో కలిసి బురుజుపల్లికి వెళ్లి తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా బురుజుపల్లె సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజప్పకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Tags: Road accident in Mulakalacheruvu; young man sustains severe injuries.