: ఏడుగురు అరెస్ట్, రూ.36,100 నగదు స్వాధీనం
నక్కపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావుల ఆదేశాల మేరకు, నక్కపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళి ఆధ్వర్యంలో ఎస్సై సన్నీబాబు మరియు వారి సిబ్బంది నిన్న రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
కేసు వివరాలు:
నక్కపల్లి మండలం, ఉపమాక గ్రామం శివార్లలో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో, నిన్న రాత్రి (గురువారం) సుమారు 11:00 గంటల సమయంలో పోలీసులు ఆ ప్రాంతంపై మెరుపు దాడి చేశారు.ఈ దాడిలో డబ్బులు పందాలుగా పెట్టి జూదం ఆడుతున్న ఏడుగురు (07) వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.స్వాధీనం చేసుకున్న సొత్తు:
నగదు: ₹36,100/-
మొబైల్ ఫోన్లు: 6
మోటార్ సైకిళ్లు: 6
అరెస్టయిన నిందితులపై నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 129/2026, u/s 9(1) AP Gaming Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సన్నీబాబు తెలిపారు. జిల్లాలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
Tags:Police conduct a surprise raid on people playing cards on the outskirts of Upamaka.