అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మదనపల్లె మండలం వలసపల్లె క్వారీని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బైరటీస్, క్వార్ట్జ్, లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, వైట్ కలర్ గ్రానైట్ వంటి ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వడ్డెర సామాజికవర్గానికి క్వారీ లీజుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామని మంత్రి వెల్లడించారు.
Tags; Annamayya district possesses abundant mineral wealth: Kollu Ravindra