June 12, 2026
Explore
రాజంపేటలో చీటీ యజమానిపై కొనసాగుతున్న పోలీసుల విచారణ

రాజంపేటలో చీటీ యజమానిపై కొనసాగుతున్న పోలీసుల విచారణ

June 12, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట మండలానికి చెందిన చీటీల నిర్వాహకుడు నాగేంద్ర వర్మను పోలీసులు గత మూడు రోజులుగా విచారిస్తున్నారు. మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

సమాచారం మేరకు, బ్యాంకు నుంచి బంగారం తీసుకువస్తున్న సమయంలో కోడూరుకు చెందిన నాగేంద్రతో పాటు మరో వ్యక్తిని బాధితులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో నష్టపోయిన పలువురు బాధితులు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. కాగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags: Police investigation into chit fund organizer underway in Rajampet.