మదనపల్లి ముచ్చట్లు:
ఎల్ నిన్యో వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘ప్రకృతి వ్యవసాయ ప్రచార కరదీపికలను’ మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ కరదీపికలను రైతులకు అందించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. నీటి నిర్వహణ, మిశ్రమ పంటలు, దేశవాళీ విత్తనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాట్సాప్, డిజిటల్ వేదికల ద్వారా వ్యవసాయ సలహాలు అందించాలని సూచించారు.
Tags: Launch of Natural Farming Handbooks