June 9, 2026
Explore
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి

June 9, 2026 | Andhra Pradesh

​మదనపల్లెముచ్చట్లు:

​మదనపల్లె నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన మాధవి మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మదనపల్లె మండల పరిధిలో రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని తహసీల్దార్‌కు సూచించారు.

Tags: Tahsildar Madhavi met the Collector as a courtesy call.