June 9, 2026
Explore
మహిళ తో 6 ఏళ్ళుగా సంబంధం, ఇప్పుడు అనుమానంతో హత్య

మహిళ తో 6 ఏళ్ళుగా సంబంధం, ఇప్పుడు అనుమానంతో హత్య

June 9, 2026 | Uncategorized

👉పడారుపల్లి చెరువు సమీపంలో(బీవీనగర్ RTO ఆఫీస్ సమీపం) మహిళను కత్తితో పొడిచి దారుణ హత్య చేసిన శ్రీకాంత్

👉మృతురాలు కనుపర్తిపాడుకి చెందిన రేవతి (33) గా గుర్తింపు

5th టవున్ CI శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు….

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కనుపర్తి పాడుకు చెందిన రేవతి అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు,ఈమెకు 17 ఏళ్ల క్రితం పెళ్లయింది,గత 7 సంవత్సరాలుగా భర్తకు దూరంగా తన తండ్రితో కలిసి జీవిస్తూ ఇద్దరు పిల్లలను చదివించుంటూ ఉండేది,రేవతి కి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సుమారు గత ఆరు సంవత్సరాలుగా ఇద్దరిమధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు రేవతి తరచూ ఫోన్ లో వేరే వ్యక్తి తో మాట్లాడుతున్నట్టు శ్రీకాంత్ అనుమానం పెంచుకుని మాట్లాడాలి అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతం లో రేవతి ని పడారుపల్లి చెరువు సమీపానికి(BV నగర్ RTO ఆఫీస్ సమీపం) తీసుకు వెళ్ళి ముందుగానే తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసి నేరుగా 5th టవున్ పోలీసులు ముందు లొంగిపోగా కేసు నమోదు చేసుకున్న 5th టవున్ పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Tags: Relationship with woman for 6 years; now murdered out of suspicion.