June 9, 2026
Explore
ప్రమాదంలో స్పందించిన తండ్రి , కొడుకులకు సన్మానం

ప్రమాదంలో స్పందించిన తండ్రి , కొడుకులకు సన్మానం

June 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి, తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొని పోలీసులకు సమాచారం అందించిన తండ్రి, కొడుకులకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సన్మానం చేశారు. ఈనెల 6న అర్ధరాత్రి మండలంలోని సుగాలిమిట్ట వద్ద ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడం, రెండు అగ్నికి ఆహుతికావడం విధితమే. ఆ సమయంలో బోడేవారిపల్లెకి చెందిన భూపతి, ఆయన కుమారుడు మోహిత్‌కుమార్‌లు సంఘటనను గమనించారు. వెంటనే హిటాచితో లారీలను ప్రక్కకు తొలగించి, డ్రైవర్లను కాపాడారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండ లారీలను ప్రక్కకు పెట్టించి, మంటలను ఆర్పేందుకు కృషి చేశారని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. వారికి పూలమాలలు వేసి, శాలువకప్పి సన్మానం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు సమయస్పూర్తితో ధైర్యంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని భూపతి, ఆయన కుమారుడిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ కెవి.రమణ, పోలీసులు పాల్గొన్నారు.

Tags; Father and son felicitated for their response during an accident.