June 9, 2026
Explore
దంపతుల ప్రాణాలు బలితీసుకున్న బిర్యానీ

దంపతుల ప్రాణాలు బలితీసుకున్న బిర్యానీ

June 9, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

బిర్యానీ విషయంలో ఫోన్‌లో జరిగిన వాగ్వాదం దంపతుల ప్రాణాలు బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం(33), ప్రియాంక(27) విశాఖ శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన భర్త బలరాం, భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తెచ్చి ఉంచాలని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాంక ఉరేసుకుని ఆత్మత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన బలరాం ఆమె మృతదేహాన్ని చూసి భయంతో తన నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మత్య చేసుకున్నాడు.

Tags: Biryani claims the lives of a couple.