June 9, 2026
Explore
డీజల్‌,పెట్రోల్‌ ధరల పెంపుపై సీపీఐ వినూత్న ప్రదర్శన

డీజల్‌,పెట్రోల్‌ ధరల పెంపుపై సీపీఐ వినూత్న ప్రదర్శన

June 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం డీజల్‌,పెట్రోల్‌ ధరలను పెంచడంపై సీపీఐ వినూత్న ప్రదర్శన చేపట్టింది. మంగళవారం సీపీఐ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, కార్యకర్తలు కలసి ఆటోలకు తాడుకట్టి లాగుతూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గ్యాస్‌, డీజల్‌, పెట్రోలు పెంచి సామాన్యులపై బారం వేస్తున్నారని , దీని కారణంగా ప్రజలపై ఆర్థిక భారం అధికంగా పడుతోందని ఆరోపించారు. దీనిపై కేంద్రం తక్షణం స్పందించాలని , పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags: CPI stages novel protest against hike in diesel and petrol prices.