పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కొండసముద్రం గ్రామ చెరువులో సుమారు 70 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తు తెలియని వృద్ధుడి శవాన్ని మంగళవారం గ్రామస్తులు కనుగొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, శవాన్ని నీటిలో నుంచి వెలికితీశారు. వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడా ..?లేదా అన్న విషయాలు విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఈ మేరకు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసి , శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Elderly man’s body in the pond