చిట్వేల్ ముచ్చట్లు:
రైల్వే కోడూరు నియోజకవర్గం నగిరిపాడు పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో గల రామిరెడ్డి కుంటలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం ఎవరో అతడిని దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై కేవలం ప్యాంట్ మాత్రమే ఉంది. ఈ ఘటనపై చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆనవాళ్లను బట్టి ఎవరైనా తమ కుటుంబ సభ్యులుగా గుర్తిస్తే వెంటనే చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Tags: Body of unidentified person found in Ramireddy Kunta.