రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి ప్రాంతంలో మామిడి రైతులపై జరుగుతున్న వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల దోపిడీని వెంటనే అరికట్టాలని ‘మామిడి రైతు హక్కుల పరిరక్షణ వేదిక’ డిమాండ్ చేసింది. తూకాల్లో మోసాలు, “సూట్” పేరుతో టన్నుకు 100 కిలోల వరకు కోత విధించడం, 10 శాతం కమీషన్ వసూలు చేస్తూ రైతులను దివాళా తీయిస్తున్నారని మండిపడింది. పంట అమ్మాక కూడా డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకోవడం అమానుషమన్నారు. తూకాలను డిజిటలైజ్ చేయాలని, 24 గంటల్లో చెల్లింపులు జరపాలని, లేదంటే మండీల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
Tags: Rayachoti mango farmers must be supported: Protection Forum