హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు బత్తిని సోదరుల కుటుంబం అందించే ప్రసిద్ధ ‘చేప మందు ప్రసాదం’ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈనెల 8వ తేదీ రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది.
179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేప మందు ప్రసాదం కోసం దూధ్ బౌలి లోని స్వగృహంలో జూన్ 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించి, 8న ఉదయం ప్రసాదాన్ని తయారు చేయనున్నారు.
Tags:Fish medicine prasadam