పీలేరు ముచ్చట్లు:
పీలేరు మండలం మొరవపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిరుత కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నామని, పశువుల కాపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వెంటనే నిఘా కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Tags: Leopard on the prowl in Pileru: Panic ensues.