ఆదర్శంగా నిలుస్తున్న మిత్రులు
- తిరువణ్ణమలైలో ఆలోచన
- పుంగనూరులో ఆచరణ
పుంగనూరుముచ్చట్లు:
పున్నమి రోజు తిరువణ్ణమలైలో గిరిప్రదక్షణ సమయంలో అల్పాహారం తీసుకుంటుండగా వచ్చిన ఆలోచన ఆనలుగురి మిత్రులకు గోసేవ చేయాలని నిర్ణయించి, ప్రతి పున్నమికి గోవులు ఒక లారీ లోడ్డు పచ్చగడ్డి అందించే మహత్‌కార్యం పుంగనూరులో పురుడు పోసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
అలోచన ఎలా వచ్చిందంటే ….
పట్టణంలో సాధారణ కుటుంబాల్లో జన్మించిన కెఎస్.మణి, మదన్‌మోహన్‌సెట్, గణేష్‌రెడ్డి లు ప్రస్తుతం వ్యాపారం చేస్తుంటారు. విద్యాసాగర్ సాప్ట్వేర్ ఇంజనీర్. కానీ నలుగురు మంచి మిత్రులుగా ఉన్నారు. వీరు ప్రతి పున్నమికి తమిళనాడులోని తిరువణ్ణమలై వెళ్లి గిరిప్రదక్షణం చేసి రావడం అలవాటు. ఇలా ఉండగా మూడేళ్ల క్రితం గిరిప్రదక్షణకు వెళ్లి అక్కడ అల్పాహారం తీసుకుని అరిటాకులను క్రిందపడేసే సమయంలో పశువులు పరుగున వచ్చి అరటిఆకులను తినడంతో ఆరోజు పశువులకు గడ్డి ఇవ్వాలనే ఆలోచన వారిలో వెహోదలైంది. గోమాతలో సకల దేవతలు కొలువైనందున బయట తీర్థయాత్రలు చేయడం ఎందుకు… పుంగనూరులోనే పశువులకు సేవ చేద్దామని నిర్ణయించారు. తమ శక్తి మేరకు చందాలు వేసుకుని మరుసటి పున్నమి నాటికి లారీ పచ్చగడ్డి కొనుగోలు చేసి బైపాస్ రోడ్డులోని ఆర్టీసి డిపో వద్ద ఉచితంగా ఇవ్వడం చేపట్టారు. రెండునెలల పాటు ప్రచారం లేకపోవడంతో గడ్డిపంపిణీ కష్టతరమైంది. ప్రస్తుతం ప్రచారం ఊపందుకోవడంతో లారీ లోడ్డు పచ్చగడ్డి గంటల్లో తీసుకెళ్తున్నారు. అదే కాకుండ పశువులు సైతం పున్నమి రోజున అక్కడికి వచ్చి పచ్చగడ్డి తినడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ధరలతో పనిలేదు…
నలుగురు మిత్రులు ప్రతి నెల చందాలు వేసుకుని గడ్డి ధర ఎంత ఉన్న లారీ లోడ్డు కొనుగోలు చేయడం చేపట్టారు. ప్రస్తుతం సుమారు రూ.10 వేలకు పైగా విలువ చేసే పచ్చిగడ్డి పున్నమి రోజు పశువులకు ఉదయం నుంచి అందిస్తారు. పశువుల యజమానులు, వీధి పశువులు సైతం ఆహారం కోసం తాటిమాకులపాళెంలోని ఆర్టీసి డిపో వద్దకు చేరిపోతున్నాయి. యజమానులు తమకు కావాల్సిన గడ్డిని వాహనాలు, ఆటోలలో తీసుకెళ్తారు. ఇలా ప్రతి నెల చేస్తుండటంతో లక్షలాది రూపాయలు పశువుల ఆహారం కోసం తమ ఆదాయాన్ని కేటాయిస్తుస్తూ , గోమాతల సేవలో తరిస్తున్న నలుగురి మిత్రులు పట్టణంలో ఆదర్శంగా నిలుస్తూ మన్ననలు పొందుతున్నారు.




Tags: A Delight for Cows on the Full Moon Day – The Cow Service by Those Four