పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 8వ తేదీ నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఏవో రాధ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రైతులకు వేరుశెనగ , జనుము, జీలుగ పంపిణీ చేస్తామన్నారు. వేరుశెనగ 30 కీలోల బస్తా ధర రూ.1836లు, జనుము 10 కేజిల బస్తా రూ.770, జీలుగ 10 కేజిల బస్తా రూ.800 లతో విక్రయించేలా ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అవసరమైన రైతులు తమ పాసుపుస్తకం, ఆధార్‌కార్డులు తీసుకుని సంబంధిత ఆర్‌ఎస్‌కెలలో విత్తనాలు పొందాలని సూచించారు.
Tags: Seeds to be distributed at Rythuseva Kendras from 8th