June 6, 2026
Explore
ఆహార భద్రత పై అవగాహన సదస్సు

ఆహార భద్రత పై అవగాహన సదస్సు

June 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం స్థానిక లీనార్డ్ పాఠశాలలో ఆహార భద్రతపై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి గురులక్ష్మీ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ సుగుణ సమావేశం ఏర్పాటు చేశారు. గురులక్ష్మీ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. పిల్లలు , వృద్ధులు , తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ఆహారము, అలవాట్లపై అవగాహన కల్పించారు. అలాగే నిత్యం తినే ఆహారంలో ఆకుకూరలను ఎక్కువుగా తినాలని , చిడుతిండ్లు మానివేయాలని సూచించారు.

Tags; Awareness Seminar on Food Safety