గుంటూరు ముచ్చట్లు:
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కోటేశ్వరమ్మ మెదడులో ఏర్పడిన కణితిని తొలగించడానికి వైద్యులు మత్తుమందు లేకుండానే ఆపరేషన్ చేశారు.
శస్త్రచికిత్స సమయంలో ఆమె పూర్తిగా మెలకువతో ఉండగా, ఆమె అభిమాన హీరో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాను ప్రదర్శించారు.
డాక్టర్లు అరుణ్ కుమార్, రాజశేఖర్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ అత్యంత నైపుణ్యంతో కూడిన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
Tags;Doctors performed brain surgery while watching a Pawan Kalyan movie.