అమరావతిముచ్చట్లు:
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీనే జూనియర్ కాలేజీలు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు నిన్నటి వరకు కొనసాగడంతో ఆలస్యమైంది.
ఇక ఇంటర్ ఫస్టియర్లో 34,914 మంది, సెకండియర్లో 91,268 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎల్లుండి నుంచి మూల్యాంకనం మొదలవుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Tags:Summer holidays for junior colleges have ended.