June 6, 2026
Explore
మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది

మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది

June 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది.

గత 50 ఏళ్లలోనే అమెరికా గడ్డపై నిర్మిస్తున్న మొట్టమొదటి భారీ, ప్రపంచ స్థాయి ఆయిల్ రిఫైనరీగా ఇది పేరుపొందింది. అంతే కాదు ప్రపంచంలోనే అతి పెద్దది.

చారిత్రాత్మక $300 బిలియన్ల పెట్టుబడితో రిలయెన్స్ ఈ వార్తతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 20 సంవత్సరాల వాణిజ్యపరమైన బైండింగ్ ఒప్పందాన్ని (commercial binding agreement) రిలయెన్స్ కుదుర్చుకుంది.

ట్రంప్ కు ఇందులో అనధికారిక భాగస్వామ్యం ఉంది అనేది బహిరంగ రహస్యం.

ఈ రిఫైనరీలో ట్రంప్ తన వ్యక్తిగత నిధులను పెట్టుబడిగా పెట్టనప్పటికీ, వాచ్‌డాగ్ గ్రూపులు (నిఘా సంస్థలు), ఆర్థిక బహిర్గత పత్రాల ఆధారంగా ఈ రెండు సంస్థల మధ్య ఉన్న ఒక భిన్నమైన ఆర్థిక సంబంధాన్ని గుర్తించాయి.

2024లో, ట్రంప్ తన రెండవ విడత అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఒక విభాగం (రిలయన్స్ 4IR రియల్టీ డెవలప్‌మెంట్), ముంబైలో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లైసెన్సింగ్ ఒప్పందం కోసం ట్రంప్ ఆర్గనైజేషన్‌కు $10 మిలియన్ల (10 మిలియన్ డాలర్ల) డెవలప్‌మెంట్/లైసెన్సింగ్ ఫీజును చెల్లించింది.

రిలయన్స్ సంస్థ రెండు దశాబ్దాల పాటు 1.2 బిలియన్ బారెళ్ల అమెరికన్ లైట్ షేల్ ఆయిల్ (light shale oil) ను, దాని శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎవరికీ సాధ్యంకాని, అతి ఖరీదైన చారిత్రాత్మక భారీ ఒప్పందం చేసుకుంది.

అందుచేత మనకి అర్థమయ్యేది ఏమిటంటే మన దేశం మరొక 20 ఏళ్ళ పాటు ఖరీదైన అమెరికన్ ఆయిల్ నే కొనబోతోంది. చవక రష్యన్, ఇరానియన్ ఆయిల్ ను ఉపయోగించే ప్రాప్తం మనకు లేదు.

ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ సంస్థ సదరు రిఫైనరీ ఉత్పత్తి చేసే ఇంధనాలను (గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఇంధనం) కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది, అలాగే నిరంతరం అమెరికన్ షేల్ (shale) ఆయిల్ ను కొనుకోలు చేస్తామన్న భరోసాను ఇస్తుంది, భారతీయ ధనాన్ని నిరంతరం అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చెయ్యడానికి, అక్కడి ద్రవ్యలోటును తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ సాయపడుతుంది.

రూపాయి విలువ మరింతగా పడిపోవడానికి మన సంపదను తరలించివేసే ఇటువంటి విదేశీ ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీలు పెట్టే భారీ పెట్టుబడులు ప్రధాన కారణంగా ఉన్నాయి.

Tags: It is located at the southern tip of Texas, near the Mexican border.