చిత్తూరు ముచ్చట్లు:
బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంతో వాహనంలో ఉన్న మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
విషయం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని లిక్కర్ సీసాల కోసం ఎగబడ్డారు.
కొందరు పెట్టెలతోనే తీసుకెళ్లగా, మరికొందరు లుంగీలు, టవళ్లలో బాటిళ్లను నింపుకుని వెళ్లిపోయారు.
మహిళలు కూడా ఈ హడావుడిలో పాల్గొనడం గమనార్హం.
చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో కొన్ని సీసాలు మిగిలాయి.
Tags: Liquor van overturns after losing control; people scramble for the bottles.