June 5, 2026
Explore
శిక్షణలో ఉపాధ్యాయుల ఆకలి కేకలు

శిక్షణలో ఉపాధ్యాయుల ఆకలి కేకలు

June 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పరిధి లోని మాసాపేట జెడ్పీ హైస్కూల్‌లో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో జరుగుతున్న FLN ఉపాధ్యాయ శిక్షణలో భోజనం, తాగునీరు అందక 600 మంది ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 6 రోజుల శిక్షణలో మొదటి రెండు రోజులూ 350 మందికే భోజనం సిద్ధం చేయడంతో మిగిలిన వారు ఆకలితో అలమటించారు. మంచినీటి సదుపాయం లేక బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.

కడప, అన్నమయ్య జిల్లాల శిక్షణ కేంద్రాల కాంట్రాక్టును ‘భారతి ఎంటర్‌ప్రైజెస్’ సంస్థ ఒక్కరికే అప్పగించడమే ఈ గందరగోళానికి కారణమని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరికి భోజనం, వసతి కోసం రూ. 300 కేటాయించగా, సదరు సంస్థ కేవలం రూ. 140 లకే సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల నాసిరకం భోజనం పెడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని, అధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags; Teachers’ cries of hunger during training