అమరావతిముచ్చట్లు:
భారత్లో 1853లో రైల్వేలు ప్రారంభమైనప్పుడు టాయిలెట్ సౌకర్యం ఉండేది కాదు. ప్రయాణికులు స్టేషన్లలోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చేది.అయితే 1909లో అఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు తీవ్ర కడుపు నొప్పితో అహ్మద్ పూర్ స్టేషన్లో టాయిలెట్ కు వెళ్ళినప్పుడు, ఆయన రాకముందే రైలు కదిలిపోయింది. అర్ధాంతరంగా బయటకు రావడంతో పడిన ఇబ్బందిని ఆయన బ్రిటిష్ అధికారులకు లేఖ ద్వారా వివరించారు. ఆ విన్నపం స్వీకరించిన అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లలో టాయిలెట్ల ఏర్పాటును తప్పనిసరి చేశారు.
Tags:When were toilets introduced on trains?