తిరుపతి ముచ్చట్లు:
- ఆటో డ్రైవర్లకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
- రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని ఆటో డ్రైవర్లకు సూచనలు.
- డ్రగ్స్‌కు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ డి. కొండయ్య నాయుడు , ఈగిల్ సెల్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు “డ్రగ్స్ వద్దు బ్రో” మరియు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ డి. కొండయ్య నాయుడు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ అలవాటు యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు నేరాలకు దారితీస్తుందని వివరించారు. డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అలాగే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈగిల్ సెల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు మరియు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Tags; “Say no to drugs, bro – save your life.”