తిరుపతి ముచ్చట్లు:
- సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు, రోడ్డు భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన.
- అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సేవలు, హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగంపై సూచనలు.
- అప్రమత్తతతో వ్యవహరించి నేరాలను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు నాయుడుపేట డియస్పి ఆధ్వర్యంలో శ్రీహరికోట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో షార్ రోడ్డులో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు పంపే లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళలపై జరిగే నేరాల నివారణ, మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న అత్యవసర సేవలు, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. మహిళలు ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సహకరిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు వాహనదారులు పాల్గొన్నారు.
Tags: Public safety is the goal; awareness is the path to crime prevention.